- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తాం
దిశ , భువనగిరి : ప్రపంచ స్థాయిలో యాదగిరిగుట్ట(యాదాద్రి) ప్రసిద్ధ పుణ్య క్షేత్రాన్ని భక్తులు సందర్శించడానికి కావలసిన వసతులను కల్పించడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆవరణలోనిర్మించబోయే బస్ డిపో,బస్టాండ్ నిర్మాణ స్థలాలను రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మించిన ప్రధాన ఆలయ పనులు పూర్తి అవుతున్నందున ఆలయ ఆవరణలో నిర్మించబోయే కళ్యాణకట్ట, అన్నదాన సత్రం మొదలగు ఆధ్యాత్మిక ప్రదేశాలకు భక్తులను చేరవేసేందుకు అనువైన ప్రదేశాల్లో బస్టాండ్, బస్ డిపోలను ఏర్పాటు చేసేందుకు స్థలాలను మంగళవారం పరిశీలించినట్లు తెలిపారు.
బస్ టెర్మినల్‌తోపాటు టెంపుల్ టర్మినల్‌లను ప్రత్యేకంగా వేర్వేరుగా నిర్వహిస్తామన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బస్ స్టాండ్, బస్ డిపోల నిర్మాణాలు చేపడుతామన్నారు. భక్తులకు కాటేజీలు, వస్తువులను భద్రపరచడానికి బ్లాకులను ఏర్పాటు చేస్తామన్నారు. యాదగిరిగుట్టకు రింగ్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో టెంపుల్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖులు సందర్శించడానికి ప్రెసిడెన్షియల్ షూట్ ,కళ్యాణకట్ట, పుష్కర ఘాట్, టెంపుల్ లోపలికి పోవడానికి, బయటకు వెళ్ళడానికి కావలసిన ప్రముఖ ద్వారాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గుడి పైకి వెళ్లడా నికి ప్రత్యేకంగా బస్సులను నడుపు తున్నామని, బస్ టెర్మినల్‌లో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను సందర్శించడానికి లక్షలాది మంది భక్తులకు 50 సంవత్సరాలకు సరిపోను ఆధునాతన వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్టలోని వివిధ ప్రదేశాలను భక్తులు సందర్శించడానికి అనువుగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బస్ టెర్మినల్, టెంపుల్ టర్మినల్ ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్‌ను త్వరలోపరిశీలిస్తామని తెలిపారు. బస్ డిపోలో 150 బస్సులు నైట్ హాల్ట్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైటీడీఎ ఆధ్వర్యంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ పూర్తిస్థాయిలో రూపొందిస్తామన్నారు.