వలస కార్మికులను ఆదుకుంటున్నాం: మహేష్ భగవత్

by Shyam |
వలస కార్మికులను ఆదుకుంటున్నాం: మహేష్ భగవత్
X

దిశ, న్యూస్‎బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో రాచకొండ ఏరియాలో పని చేస్తున్న వలస కార్మికులకు… స్థానిక దాతల సాయంతో భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. సీపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇటుక బట్టీ, మార్బుల్స్, భవన నిర్మాణాలలో ఉన్న కార్మికులు ఎక్కడ ఉన్నవారందరినీ అక్కడే ఉంచి దాతల సహాయంతో ఆదుకోవాలన్నారు. బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు హైదరాబాద్‎కి వలస వచ్చి ఇటుక బట్టీల వద్ద జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలను కిరాయికి తీసుకొని తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. అలా వెళ్లినవారిని చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది వెనక్కి పంపిస్తారని తెలియజేశారు. అందుకే వారికి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. వెస్ట్ బెంగాల్‎కి సంబంధించిన 200 మంది వలస కార్మికులకు సోషల్ ఆర్గనైజేషన్ దాతల సహాయంతో బాలాపూర్ తదితర ప్రాంతాలలో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్వారంటైన్‎లలో ఉన్నవారు 21 రోజులు బయటి వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ కర్ఫ్యూ ను లెక్కచేయకుండా బయటికి వెళ్లినట్లైతే IPC 188 సెక్షన్ కింద శిక్షా అర్హులు అని రాచకొండ సీపీ హెచ్చరించారు.

Tags: cp mahesh Bhagavat, We support, migrant workers, hyderabad

Advertisement

Next Story

Most Viewed