మంత్రి నానిపై దాడిని ఖండిస్తున్నాం: సుచరిత

by srinivas |   ( Updated:2020-11-29 11:56:49.0  )
మంత్రి నానిపై దాడిని ఖండిస్తున్నాం: సుచరిత
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పేర్ని నానిని హోం మంత్రి సుచరిత, డీజీపీలు ఆదివారం పరామర్శించారు. మంత్రి పేర్ని నానిపై దాడిని ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. నిష్పక్ష పాతంగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీ సాను భూతి పరుడని తెలుస్తోందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తునకు పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు.

కాగా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఆయన నివాసంలో నాగేశ్వర్ అనే వ్యక్తి దాడికి యత్నించాడు. మంత్రి నానిని కలవడానికి వచ్చిన నాగేశ్వర రావు.. మంత్రి కాళ్లకు దండం పెడుతూ ఒక్కసారిగా తాపితో ఆయనపై దాడికి యత్నించాడు. కాగా వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు నాగేశ్వరరావును పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed