- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పునీత్ లెగసీ ఆగకూడదు.. ఇల్లు వచ్చే ఏడాది కొనుక్కుంటా: విశాల్
దిశ, ఏపీ బ్యూరో: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మా ఫ్యామిలీలో ఒక మనిషి అని హీరో విశాల్ అన్నారు. అతని మరణం మా ఇంటిలో మనిషిని కోల్పోయినట్లుందని అన్నారు. బుధవారం తెల్లవారు జామున విశాల్ ఎనిమి మూవీ టీంతోపాటు నటి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాతో కలిసి విశాల్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇకపోతే విశాల్ హీరోగా నటించిన ఎనిమి మూవీ దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ మాట్లాడుతూ.. పునీత్ మరణించినా అందరి గుండెల్లో ఉన్నాడని అన్నాడు.
కుటుంబ సభ్యుడిని కోల్పోయా..
శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం తనను కలచివేసిందని హీరో విశాల్ అన్నాడు. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను తాను కలిశానని, కొన్ని ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడుకున్నామని తెలిపాడు. పునీత్ మరణం తనకు తీరనిలోటు అని వ్యాఖ్యానించాడు.
పునీత్ లెగసీని కొనసాగిస్తా..
పునీత్ రాజ్‌కుమార్ గొప్ప మానవతావాది అని చెప్పుకొచ్చాడు. పునీత్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని వెల్లడించాడు. ఇంటిని కొనడానికి దాచి పెట్టుకున్న డబ్బును పునీత్ చదివిస్తున్న 1800మంది పిల్లల కోసం వెచ్చిస్తానని స్పష్టం చేశాడు. ఇల్లు ఈరోజు కాకపోతే వచ్చే ఏడాది అయినా కొనుక్కుంటానని కానీ పునీత్ లెగసీని కొనసాగించడం అవసరమని విశాల్ అభిప్రాయపడ్డాడు. పునీత్ భౌతికం లేకపోయినా అందరి గుండెల్లో ఉన్నాడని విశాల్ అన్నారు. పునీత్ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలు ఎక్కడా ఆగకూడదనేదే తన లక్ష్యమని విశాల్ చెప్పుకొచ్చాడు.