- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
దిశ, ఏపీ బ్యూరో: హోంగార్డులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. 58వ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా సవాంగ్ శుభాకాంక్షలు తెలిపారు. వేతనాల పెంపు, ప్రమాద బీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాలను మెరుగు పరిచామన్నారు. రాష్ట్రానికి హోంగార్డులు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రూ.18 వేల నుంచి రూ. 21,300 వేతనం పొందుతున్నట్లు తెలిపారు.
15 వేల మంది హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఆకస్మిక మరణం సంభవిస్తే హోంగార్డు కుటుంబానికి రూ.60 లక్షల బీమా వర్తిస్తుందని సవాంగ్పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సవాంగ్వివరించారు.