- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ్యత మన పైనే ఉంటుంది : సజ్జనార్
దిశ, క్రైమ్ బ్యూరో : ఇంటి నుంచి బయటకు వెళితే.. సురక్షితంగా తిరిగి రావాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందని, తల్లిదండ్రుల ప్రపంచం పిల్లలే అనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు ఓపికతో పాటించాలని సూచించారు. ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్‌తో కలిసి రోడ్డు ప్రమాదాలు- నివారణ అనే అంశంపై సీపీ సజ్జనార్ బుధవారం ఆలిండియా రేడియో లైవ్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలను డ్రైవ్ చేయడం రోడ్ టెర్రరిజం లాంటిదన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు జైలుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఈ నేరానికి పాల్పడితే, సెక్షన్ 304 పార్ట్ -2 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసే వారి వివరాలు ఆర్టీఓకు పంపిస్తున్నట్టు తెలిపారు. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, మళ్లీ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్‌తో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రంకెన్ డ్రైవ్ నివారణకు ఆయా కంపెనీ యాజమాన్యాలకు పోలీసు శాఖ లేఖలు రాస్తున్నట్టు వివరించారు.