- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమస్యలపై అలుపెరుగని పోరాటం
by Shyam |

X
దిశ, హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఇటీవల మూడో పర్యాయం టీఎన్జీవో అధ్యక్షుడుగా కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజేందర్, కోశాధికారిగా రామినేని శ్రీనివాస రావు ఎన్నికైనందుకు మంగళవారం నాంపల్లిలోని ఎన్జీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్, నగర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఎన్జీవో మహిళా సంఘం అధ్యక్షురాలు రేచల్ తదితరులు పాల్గొన్నారు.
Next Story