రేపు శ్రీరాంసాగర్ వరద కాలువకు నీటి విడుదల..!

by  |
రేపు శ్రీరాంసాగర్ వరద కాలువకు నీటి విడుదల..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు గురువారం నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఎస్సారెస్పీ ఎస్ఈ సుశీల్ దేశ్ పాండే, ఈఈ బి.రామారావులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు వరద కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని.. పరివాహక గ్రామాల ప్రజలు కాలువలోకి వెళ్లవద్దని సూచించారు. పశువుల కాపరులు, రైతులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అటువైపు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

,శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1090.1 అడుగుల సామర్ధ్యంతో 85.36 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 20,355 క్యూసెక్కుల ఇన్‎ఫ్లో ఉండగా.. 7,624 క్యూసెక్కుల ఔట్‎ఫ్లో కొనసాగుతోంది. ఇన్‎ఫ్లో ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 90.31 టీఎంసీల నీరు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


Next Story

Most Viewed