వంతెన దాటాలంటే నీటి కష్టాలే.. పట్టించుకోని అధికారులు..

by Shyam |   ( Updated:2021-07-16 11:01:16.0  )
వంతెన దాటాలంటే నీటి కష్టాలే.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, నిజామాబాద్ రూరల్: చినుకుపడితే రోడ్డు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి రైతన్నలు తీవ్రకష్టాలు ఎదుర్కొంటున్న దుస్థితి. రూరల్ మండలంలోని డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ ఆరెపెల్లి గ్రామాల రైతన్నలు వంతెన నిర్మాణానికి సుమారుగా యాభై లక్షలు మంజూరు కాగా దానిని పూర్తి చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఒకవైపు పూర్తిగా సీసీ రోడ్డు పూర్తిచేసిన సంవత్సరం రెండు సంవత్సరాలు కాగా మరోవైపు సీసీ రోడ్లును పూర్తిచేశారు. వంతెన నిర్మాణం ఆరంభం నుండి సమస్యలతో మొదలయ్యింది. అంతకు మునుపు అంతర్గత రైల్వే వంతెన లేకుండా వాహనాలన్నీ రైల్వే ట్రాక్ మీదుగా బర్దీపూర్ గ్రామం నుండి ఆరెపల్లి గ్రామానికి రోజువారీగా వాహనదారులు ప్రయాణం కొనసాగించేవారు. బర్దీపూర్ ధర్మారం గ్రామానికి చెందిన రైతులకు అంతర్గత రైల్వే వంతెన దాటిన తర్వాత దాదాపు రెండు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది.

ప్రతిరోజు రైల్వే అంతర్గత వంతెన నుండి రైతులు వెళ్లాల్సి ఉండటంతో చిన్న వర్షం తాకిడికి రైల్వే అంతర్గత వంతెన కింద నీరు నిలిచి రైతులు నడిపల్లి, డిచ్పల్లి మండల కేంద్రం నుండి ముల్లంగి, కంజర్, ఆరెపల్లి గ్రామాల మీదుగా వారి,వారి వ్యవసాయ క్షేత్రాలకు చేరుకుని తిరిగి అదే దారి వెంబడి ద్విచక్ర వాహనాలు తో తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో రైతన్నలకు పంటలు, నాట్లు వేసినప్పుడల్లా రైల్వే అంతర్గత వంతెన పైనుండి వెళ్లడానికి ట్రాక్టర్లు, వ్యవసాయ కూలీలకు తీవ్ర ఇబ్బందు కలుగుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన వంతెన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది తప్ప ఎలాంటి ఉపయోగం లేదని రైతన్నలు వాపోతున్నారు. వంతెన నిర్మించక ముందు రైల్వే ట్రాక్ పై నుండి వ్యవసాయ క్షేత్రాల్లో కి వెళ్లడం సులువుగా ఉండేదని రైతులు, ప్రజలు పేర్కొంటున్నారు.


రైల్వే అంతర్గత వంతెన నిర్మాణంలో ఆలస్యమైనప్పటికీ నీ సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందని ప్రజలు పేర్కొంటున్నారు.ఆరేపల్లి, కంజర్,కులాసుపుర్, మోపాల్ వెళ్లాలంటే రైతులు, ప్రయాణీకులు
రైల్వే అంతర్గత వంతెన క్రింద నిలిచిన నీటికి భయపడి ద్విచక్రవాహనాలు దారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తాము నడిపే ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగి పోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ ఆరెపెల్లి గ్రామాల మధ్యనున్న రైల్వే అంతర్గత వంతెన నిర్మాణం పూర్తయినా చిన్నపాటి వర్షానికే నీటి నిలవడంతో రైతులు, ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కలిగినా అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలంటే వాహనాలు వంతెన వద్ద వాహనం నిలిపి వ్యవసాయ క్షేత్రాల్లో కి కాలినడకన వెళ్లవలసి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పండించుకొని అంతర్గత రైల్వే వంతెన నుండి నీటిని పంపుసెట్ల ద్వారా తొలగించి రైతులకు ప్రజలకు వాహనదారులకు గ్రామాలకు చేరుకుని వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని పేర్కొంటున్నారు. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన వంతెన కురిసిన కాస్త వర్షానికే నీరు చేరి ఇబ్బందుల పాలవుతున్నామని ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము

నాకు రైల్వే అంతర్గత బ్రిడ్జి దాటిన తర్వాత 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. చిన్నపాటి వర్షానికే బ్రిడ్జి కింది భాగంలో నీరు బాగా నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది వ్యవసాయ కూలీలు వెళ్లాలన్న నాట్లు వేయటానికి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. భారీ వర్షం కురిస్తే నడిపెల్లి, డిచ్పల్లి మండల కేంద్రం, మీదుగా ముల్లంగి, కంజర్, ఆరెపెల్లి, గ్రామాల నుండి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్తున్నారు.దాదాపు దీంతో మా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు వాహనం ద్వారా వెళ్లాలి అంతర్గత రైల్వే వంతెన కింద ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే అర కిలోమీటర్ దూరం లో మా పొలాల వద్దకు చేరుకుంటాం. అధికారులు పట్టించుకోని రైల్వే అంతర్గత బిడ్జి కింద ఉన్న నిలిచిన నీటిని పంపుసెట్ల ద్వారా తొలగించే ప్రయత్నం చేయవలసి గ్రామస్థుల తరుపునుండి కోరుతున్నాం.
-ఈగ శ్రీనివాస్ రెడ్డి, రైతు

Advertisement

Next Story

Most Viewed