నీటి సమస్యలను పరిష్కరించాలి

by Shyam |
నీటి సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, హైదరాబాద్: వాటర్ బోర్డు పరిధిలో మంచినీటి సరఫరాలో వస్తున్న లోఫ్రెషర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎండీ దానకిషోర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటర్ బోర్డు జీఎంలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‎లో ఎండీ మాట్లాడుతూ.. నగరంలోని మారెడ్ పల్లి, గుచ్చి బౌలి, రాజేంద్ర నగర్, కొండాపూర్, చిలకలగూడ, బాచుపల్లి, కాచిగూడ, తలాబ్ కట్ట, నాచారం, గోషామహల్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో అరకొర నీటి సరఫరాను పరిష్కరించాలని పలు ఫిర్యాదులు అందాయి. మంచినీటి సరఫరాలో లోప్రెషర్, బిల్లింగ్, సెవరెజీ, రెవెన్యూ ,ట్యాంకర్ల పంపిణీ తదితర ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ విషయాలపై అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వాటర్ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి ప్రతి డివిజన్ పరిధిలో అదనపు సిబ్బందిని గుర్తించాలని వివరించారు. ప్రధాన కార్యాలయం లో అత్యవసరంగా స్పందించేందుకు 100 మంది లైన్ మెన్లు, సేవరేజ్ సిబ్బంది, 1 జీఎం, ఇద్దరు డీజీఎంలు, నలుగురు మేనేజర్లు, ఒక ఎస్సై, పోలీస్ సిబ్బంది ఉండేలా 4 టాస్క్ ఫోర్స్ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి కార్యాలయంలో సోడియం హైపోక్లోరైట్ రసాయనం చల్లించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి శానిటైజర్, మాస్కులు వాడేలా చర్యలు తీసుకోవడమే కాకుండా, అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఈడీ డాక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్ కుమార్, అజ్మీరా కృష్ణ, రవి, శ్రీధర్ బాబు, వాసుదేవ నాయుడు, సీజీఎంలు పాల్గొన్నారు.

Tags: Water Board, Water Pressure, Problem in Hyderabad, MD Dana kishore

Advertisement

Next Story

Most Viewed