- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంబు పేల్చిన వాచ్‌మెన్ రంగయ్య.. ‘కోర్టులో ఏం చెప్పానో తెలియదు’..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాచ్‌మెన్ రంగయ్య చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. తాను కోర్టులో ఏం చెప్పానో తనకే తెలియదని రంగయ్య స్పష్టం చేశారు. అయితే, సీబీఐ అధికారులు అతన్ని జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారని, అక్కడ మెజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగయ్య స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
దీనిప్రకారం వివేకానందరెడ్డి హత్యకు రూ.8 కోట్ల సుపారీ ఇచ్చారని, మొత్తం 9 మంది హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య ఈరోజు ఉదయం మెజిస్ట్రేట్ ముందు చెప్పాడు. అంతేకాకుండా హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారని కూడా రంగయ్య వివరించాడు. కాగా, సాయంత్రానికే రంగయ్య మాట మార్చడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట చేసిన వ్యాఖ్యలు తనకు ఏవీ తెలియదని చెప్పడం మళ్లీ కేసును తప్పు దారి పట్టించేందుకు చేస్తున్న కొత్త కుట్రగా అందరూ భావిస్తున్నారు.