మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-03-28 05:23:35.0  )
మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి హెచ్చరిక
X

దిశ, సిద్దిపేట: మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అర్ ఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం సిద్దిపేట ఎంపీడీవో ఆఫీస్ బిజెఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీహరి, హోం గార్డ్ శాకీర్‌తో కలిసి వాహనాలు తనిఖీలలో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి, మాస్కు ధరించకుండా వాహనాలు నడిపే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

మాస్కులు లేనివారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్‌లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులుగుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు.

తప్పకుండా మాస్కులు ధరించి శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని చెప్పారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశంలో తిరగవద్దని, షాపుల్లో గుంపులు గుంపులుగా ఉండవద్దన్నారు. కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed