తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..

by Shyam |
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు హెచ్చరిక. రానున్న మూడురోజులూ తెలంగాణలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకే వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య తీవ్రత అధికమని, విదర్భ నుంచి వడగాలులు వీయనున్నాయని అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ఇవి వెళ్లనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇదిలావుండగా, శనివారం నాడు అత్యధికంగా భద్రాచలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Next Story