‘డేవిడ్ వార్నర్ అలా అనుకుంటున్నాడు’

by  |
‘డేవిడ్ వార్నర్ అలా అనుకుంటున్నాడు’
X

దిశ, స్పోర్ట్స్ : డేవిడ్ వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తప్పు చేసిందని అతడు నిరూపించుకోవాలని భావిస్తున్నాడని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 2018 దక్షిణాప్రికా పర్యటన సందర్భంగా బాల్ టాంపరింగ్ (Ball tampering) వివాదంలో చిక్కుకోవడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయాడు. నిషేధం కారణంగా ఆ సీజన్ ఐపీఎల్ (IPL) కూడా ఆడలేదు. కానీ 2019లో 500 పరుగులు చేస్తానని చెప్పి మరీ అంతకంటే ఎక్కువ పరుగులే చేశాడని చోప్రా గుర్తు చేశాడు.

వార్నర్ ఆస్ట్రేలియాకు కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టకు ఆ సేవలందించి లోటు తీర్చుకుంటున్నాడు.. అతడో గొప్ప కెప్టెన్ కాగలడని వార్నర్ నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. సన్ రైజర్స్ బలాబలాలను వివరిస్తూ చోప్రా పలు వ్యాఖ్యలు చేశాడు.

‘సన్ రైజర్స్ జట్టు టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియమ్‌సన్ వంటి బ్యాట్స్‌మాన్ ఉన్నారు. అలాగే భువనేశ్వర్, రషీద్ ఖాన్, నబీ వంటి వారితో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. కానీ జట్టుకు మిడిల్ ఆర్డర్ సమస్యతో పాటు ఫినిషర్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అయితే జట్టు ఎలాంటి స్థితిలో ఉన్న వార్నర్ విజయతీరాలకు చేర్చగలడు. అతడే ఆ జట్టుకు రక్షకుడు’ అని చోప్రా వెల్లడించారు. వార్నర్‌పై ప్రస్తుతం మరింత భారం పెరిగింది. ఈ సీజన్‌లో మరింతగా రాణించి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చోప్రా అభిప్రాయపడ్డాడు.


Next Story

Most Viewed