- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ చర్య తీసుకోలేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వార్డ్ మెంబర్
by Shyam |
X
దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం తుర్కపల్లి గ్రామ సర్పంచ్, ఆమె భర్త పై ఎన్ని సార్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వార్డ్ మెంబర్ సతీష్ వాపోయాడు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక సర్పంచ్ పడాల వనిత నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, సర్పంచ్ భర్త పడాల శ్రీనివాస్ గ్రామ పంచాయతీ లో అజమాయిషీ చేస్తున్నాడని ఆరోపించారు.
ఈ విషయం పైన గతంలో ఎన్నో సార్లు కలెక్టర్‌కి ఫిర్యాదు చెయ్యగా డీపీఓ ఎంక్వయిరీ చేయడం జరిగిందని అందులో దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారణ అయిందన్నారు. అయినా కూడా ఇప్పటికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకే తాను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వార్డు మెంబర్ సతీష్ పేర్కొన్నారు.
Advertisement
Next Story