- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన వరంగల్ వైద్య సిబ్బంది…
దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: సమాన పనికి సమాన వేతనం అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రం ముందు వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ వాణి, ఫార్మసిస్ట్ రాజేంద్ర ప్రసాద్ ను మాట్లాడుతూ వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, విధి నిర్వహణలో మృతిచెందిన ఇబ్బంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని, కరోనా తో మృతి చెందితే రూ. ఒక కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుగుణ, సుప్రియ, రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
మహాబూబాబాద్‌లోనూ..
దిశ, మహబూబాబాద్ : ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు 11వ పీఆర్సీ వర్తింపజేయాలని మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రి ఉద్యోగుల విరామ సమయంలో మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరంచి దవాఖాన ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అల్‌ఎన్ హెచ్ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నూతన పీఆర్సీ ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.రమేష్, రామకృష్ణ, నూతన్, శ్రీధర్, రమ్య, స్వప్న, కవిత, సౌజన్య పాల్గొన్నారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ పీహెఎచ్ సి ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, నాగేశ్వరరావు, కవిత,సౌజన్య, సంధ్య పాల్గొన్నారు.