- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడా.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం వ్యవసాయం చేయను'
దిశ, పరకాల: పరకాల సబ్ డివిజన్ ప్రాంతంలో వరి ధాన్యం కొనుగోళ్లలో బహిరంగ దోపిడీ జరుగుతోంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై తాలు, తేమ, నాణ్యత పేరుతో ఇష్టమొచ్చిన రీతిలో కోతలు విధిస్తున్నారు. 40 కిలోల బస్తాకి సుమారు ఐదారు కిలోలు తరుగు తీస్తూ యథేశ్చగా దోపిడీకి పాల్పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. దోపిడీని సహించలేని రైతులు అక్కడక్కడా నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. అయినా అధికారులు నిద్ర మత్తు వదలడం లేదు. అడ్డూ అదుపు లేకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడం దోపిడీకి అడ్డు లేకుండా పోవడం రైతుల ఆగ్రహానికి కారణం అవుతుంది.
ఈ క్రమంలోనే శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో రైతులు ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చందుపట్ల శతేందర్ రెడ్డి అనే రైతు వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో పంట పండించలేనంటూ తనకుతానుగా శపథం చేసి దోపిడీపై హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫోన్ లో ఫిర్యాదు చేశాడు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దోపిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో దిశ పత్రిక రిపోర్టర్.. రైతు శతేందర్ రెడ్డిని సంప్రదించి వివరాలు సేకరించగా అనేక అంశాలు వెల్లడించాడు.
‘ఈనెల 9న లక్ష్యంపురం గ్రామంలోని ఓడీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 176 బస్తాల ధాన్యాన్ని తూకం వేయగా 76 క్వింటాళ్ల 65 కిలోలు తూకం వచ్చింది. ఇందులో తాలు, తేమ సంచిల కింద 2 కింటాళ్ల 11 కిలోలు తరుగు తీసివేయగా 73 క్వింటాళ్ల 54 కిలోలు/ నికర తూకంగా కొనుగోలు కేంద్రం నిర్ణయించింది. ఇట్టి బస్తాలను పరకాల పట్టణంలోని వసుంధర రైస్ మిల్లుకు చేర్చగా నాణ్యత పేరుతో మిల్లు యజమాన్యం ధాన్యం దిగుమతి చేసుకోమని అభ్యంతరం చెప్పారు. నాణ్యతా లోపం కింద మిల్లు యజమాన్యం మరో 7 క్వింటాళ్ల 14 కిలోలు తరుగు తీస్తేనే దిగుమతికి అనుమతి ఇచ్చారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో 11 క్వింటాళ్ల తరుగును అంగీకరించాల్సి వచ్చింది. గతంలో సైతం అన్యాయానికి గురయ్యానని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం బాధేస్తోంది. ఆరుగాలం పండించి దళారుల పాలు చేయాల్సి వస్తుంది. గత్యంతరం లేని స్థితిలో కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడాను. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం నేను పంట వేయలేను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
- Tags
- KCR