- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తే ప్రతి ఒక్కరూ పోలీసే.. డీసీపీ కీలక వ్యాఖ్యలు
దిశ, గీసుగొండ: ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని ఈస్ట్ జోన్ డిసీపీ వెంకటలక్ష్మి అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశానుసార౦ మంగళవారం గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ కొనుగోలు చేసిన తరువాత జరిమానా విధించి వెహికిల్స్ విడుదల చేస్తామన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని అది వారికి ప్రాణదాతగా నిలుస్తుందని డీసీపీ హితవు పలికారు.
మద్యం సేవించి సెల్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, ఆర్టీఏ వారి సూచనలకు విరుద్దంగా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదన్నారు. రూల్స్ పాటించకపోయినట్లయితే ప్రజలే సెల్ ఫోన్‌లో రికార్డు చేసి పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చలానా విధిస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేష్ కుమార్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ దేవేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.