ఢిల్లీలో ‘కొవిడ్-19 వార్ రూం’

by Shamantha N |
ఢిల్లీలో ‘కొవిడ్-19 వార్ రూం’
X

న్యూఢిల్లీ: కరోనాపై పోరును 24 గంటలూ పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేసేలా ‘కొవిడ్ 19 వార్ రూం’ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేయనున్న ఈ వార్ రూంలో సుమారు 25 మంది నిపుణులు విధులు నిర్వహిస్తారు. టెస్టింగ్, అందుబాటులోని పడకలు, వైద్య పరికరాలు, అంబులెన్స్ సౌకర్యం, కంటైన్‌మెంట్ జోన్‌లను ఈ వార్ రూం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత పరిస్థితులే కాదు, భవిష్యత్తు అవసరాలను గుర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఏరియాలో సరిపడా అంబులెన్స్‌లు లేకుంటే ఆ సమస్యను అధికారుల ముందుకు తెస్తుంది. కాగా, వార్ రూం ఇన్‌చార్జీగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈయన వార్ రూం అవసరాలు, సూచనలకు, రాష్ట్ర ఉన్నతాధికారులను అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు.

Advertisement

Next Story

Most Viewed