- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTTs ఓపెన్ వార్.. కౌంటర్, రీ కౌంటర్‌లతో ఫైటింగ్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కాలం ఓటీటీలకు కలిసొచ్చింది. ఎంతలా అంటే ప్రేక్షకులు దాదాపు సినిమా హాళ్లను మరిచిపోయేంతలా. అందుకే ప్రస్తుతం థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అవుతున్నా సరే..మళ్లీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. ‘మాస్టర్’ ‘క్రాక్’ సినిమాలు ఇందుకు ఎగ్జాంపుల్. దీంతో పరిస్థితి ఎలా మారిపోయిందంటే..టాకీసులు ఉన్నా..ఓటీటీలో తప్పకుండా సినిమా రిలీజ్ చేయాలి అనేంతగా. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వెరైటీ కంటెంట్‌తో వచ్చేస్తున్నాయి. సినిమాలకు పూర్తిగా భిన్నంగా బోల్డ్ కంటెంట్‌ను ప్రజెంట్ చేసేందుకు ఎక్కడా వెనకాడటం లేదు. కంటెంట్ పవర్ ఫుల్‌గా ఉండి ఆడియన్స్‌కు నచ్చినప్పుడు, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని వివాదాలు చెలరేగినా వెనక్కి తగ్గడం లేదు. ఎవరెన్ని మాట్లాడినా ఆడియన్స్‌కు ఎలాంటి కంటెంట్ రీచ్ అవ్వాలి అనుకున్నాయో అలాంటివే ఇచ్చేస్తున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా..ఓటీటీలు కొట్టుకోవడమే కొంచెం కొత్తగా, చెత్తగా ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్’ డిజిటల్ ప్లాట్ ఫాం ఎంత పాపులరో అందరికీ తెలుసు. అలాగే ఓన్లీ తెలుగు కంటెంట్‌తో వస్తున్న తెలుగు వెబ్ వరల్డ్ ప్లాట్ ఫాం ‘ఆహా’ గురించి మనందరికీ తెలుసు. సరికొత్త ఐడియాలు, షోలు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో సిరీస్‌లు, సినిమాలు ప్లాన్ చేస్తోంది. కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే పనిచేస్తోంది. ‘ఆహా’ అనేలా మెప్పిస్తోంది. ‘కలర్ ఫొటో’ ‘సూపర్ ఓవర్’ ‘కంబాలపల్లి కథలు – మెయిల్’ ‘సామ్ జామ్’ లాంటివి ఇందుకు ఉదాహరణలు. అందుకేనేమో మరో ఓటీటీ ప్లాట్ ఫాం తెలుగు ఒరిజినల్స్ అని చెప్పగానే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్ అంటూ ‘పిట్ట కథలు’ ఆంథాలజీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేయగా..ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సెటైర్ వేసేసింది. ‘మీ తెలుగు స్కిల్స్ బ్రష్ అప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా?’ అన్న నెట్‌ఫ్లిక్స్ పోస్ట్‌కు ఆహా ఇచ్చిన రిప్లై ..‘మనది ఎలాగూ హండ్రెడ్ పర్సెంట్ తెలుగే కదా? బ్రషింగ్‌లు అవసరం లేదు’..అయినా ‘ మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నామా? ’ అని కామెంట్ చేసింది.
దీనిపై కాస్త లేట్‌గా రియలైజ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వరుస కౌంటర్‌లు ఇస్తోంది. ‘వీడు, వీడి వేషాలు ’ కామెంట్ చేస్తూనే ..‘నో ఫైటింగ్ బాధ్యత ఉండక్కర్లే’ అనే మహేశ్‌బాబు డైలాగ్‌తో రిప్లై ఇచ్చింది. ‘ఏరా మీ ఇంట్లో అందరూ ఇలాగే తేడాగా మాట్లాడుతారా?’ అని లేటెస్ట్‌గా కౌంటర్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ ‘ఆహా’కు వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వార్నింగ్‌లో ఉన్న అర్థమేంటో పూర్తిగా తెలియదు. కానీ, మరిన్ని నెట్‌ఫ్లిక్స్ తెలుగు ఒరిజినల్స్ రెడీ అయ్యాయని తెలుస్తోంది.
మొత్తానికి రెండు ఓటీటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతుండగా ‘ఆహా’ ముందుగా ఎందుకు రెచ్చగొట్టాలి? అంటూ నెట్‌ఫ్లిక్స్‌కు కొందరు సపోర్ట్ చేస్తుంటే..మరికొందరు ‘బయట నుంచి వచ్చావ్.. పని చూసుకుని వెళ్లు.. అంతేగాని ఇలాంటి గొడవలు పెట్టుకోకు’ అని ఆహాకు మద్దతిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్చరిస్తున్నారు. మరికొందరేమో ఈ వార్ ఎంట్రా బాబు.. ఎవరి కంటెంట్ వాళ్లు ఆడియన్స్‌కు ప్రజెంట్ చేసుకునేందుకు ఈ గొడవలు ఎందుకు? అని సూచిస్తున్నారు.