2021 చూడాలంటే 21 డేస్ ఆగాల్సిందే!

by Shyam |
2021 చూడాలంటే 21 డేస్ ఆగాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్‌డౌన్ పాటించాల్సిందే. ఫ్యూచర్‌లో 2021 సంవత్సరాన్ని కళ్లారా చూడాలంటే 21 డేస్ ఇంట్లోనే ఉండాల్సిందే. యావత్ దేశం ప్రజెంట్, ప్రతీక్షణం ఈ కొటేషన్‌ను మదిలో తలచుకుంటూ ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా హోం క్వారంటైన్ పాటిస్తున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి, సీఎం కేసీఆర్‌ వరకు ప్రెస్‌మీట్లలో సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ సందేశం ఇవ్వడంతో నార్మల్ పీపుల్స్‌ అంతా తు.చ. తప్పకుండా పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యావసరాలకు తప్ప ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా బయటికి వెళ్లట్లేదు. ఈ ఇరవై ఒక్క రోజులు ఓపిక చేసుకొని ఇంట్లో ఉంటేనే ఫ్యూచర్‌ లేదంటే నో ఫ్యూచర్ అనుకుంటూ టీవీలు, పుస్తకాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇంట్లో ఉంటేనే కొత్త ఏడాది 2021 సంవత్సరంలోకి అడుగు పెడతామని, నెగ్లెట్ చేసి బయట తిరిగితే ఈ 21 రోజులు పూర్తికాకముందే ప్రాణాలు విడుస్తామన్న భయం గుప్పిట్లో జనం ఇంటి గడప దాటకుండా ఉండిపోయారు.

Tags: Corona Virus, Family Members, 21 Days Lockdown, 2021 Year , PM Modi, CM KCR

Advertisement

Next Story

Most Viewed