- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ తిరిగేది పులినా.. హైనా..?
దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా ప్రజలు క్షణక్షణం భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ప్రజలు వణికిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఆ మండల పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. పశువుల కాపారులు అడవులకు వెళ్లడానికి, రైతులు వ్యవసాయ పొలాలకు వద్దకు వెళ్లడానికి భయాందోళన చెందుతున్నారు. రాత్రి అయితే ఒక్కరూ కూడా ఇంటి గడప దాటడానికి జంకుతున్నారు.
పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో పులి అడుగులుగా భావిస్తున్న గుర్తులను పరిశీలించారు. డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టి స్పందించారు. ప్రజలు ఎవరూ భయపడోద్దని కోరారు. గ్రామాల్లో రాత్రి, పగలు బీట్ అధికారులు గస్తీ కాస్తున్నారని తెలిపారు. పాదముద్రలు పులివా, హైనావా అని తేల్చుతామని చెప్పారు. ఏజెన్సీ ప్రజలెవరూ అడవుల వైపు వెళ్లవద్దని కోరారు.