- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసుపు రైతులకు అండగా వాల్ మార్ట్ ఫౌండేషన్
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్ మార్ట్ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో పండించే పంటకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ ఏజెన్సీలో పండే పసుపులో మందుల తయారీకి కావాల్సిన కర్కుమిన్ 5 నుండి 7 శాతం అధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడి పసుపుకు మంచి గిరాకీ ఉంటుంది.
లాక్ డౌన్ కారణంగా పసుపు పంటను విక్రయించడానికి ఇబ్బంది పడుతున్న రైతులకు టెక్నో సర్వ్ అనే లాభాలు ఆశించని సంస్థ సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ సహకారంతో వాల్మార్ట్ ఫౌండేషన్ పసుపు పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా రంగం సిద్ధం చేసింది. దీంతో సుమారు 2,500 మంది చిన్న, సన్నకారు రైతులకు లాభం చేకూరుతున్నట్టు వాల్మార్ట్ ఆర్ట్ డైరెక్టర్ షెర్రీ లీ సింగ్ వెల్లడించారు.
Advertisement
Next Story