- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ప్రజాప్రతినిధులు చేసిన పనికి కుంగిపోయాం'
దిశ, తెలంగాణ బ్యూరో : వీఆర్వో వ్యవస్థ రద్దుతో సామాజిక భద్రత, గౌరవం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్ కోల్పోయామని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, కోశాధికారి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆ వ్యవస్థను రద్దు చేశారని ప్రజాప్రతినిధుల నాయకత్వంలో ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేస్తుంటే మానసికంగా తాము కుంగిపోయామని వాపోయారు. సస్పెండ్, సరెండర్, అనారోగ్యంతో దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆరేండ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టలేదని తెలిపారు. తమ భవిష్యత్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు. రెవెన్యూ శాఖకే వెన్నెముక లాంటి వీఆర్వో వ్యవస్థను పాలకులు స్వార్ధ రాజకీయాలతో ఛిన్నాభిన్నం చేస్తుంటే ఎంతో ఆవేదనకు గురవుతున్నట్టు పేర్కొన్నారు.