తహసీల్దార్లు బెదిరిస్తున్నారు: వీఆర్వోల సంక్షేమ సంఘం

by Shyam |
తహసీల్దార్లు బెదిరిస్తున్నారు: వీఆర్వోల సంక్షేమ సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. మా దగ్గరున్న రికార్డులన్నీ తీసుకున్నారు. కానీ మాతో బలవంతంగా కొందరు అధికారులు రెవెన్యూ విధులు చేయిస్తున్నారు. ఇదేం పద్ధతి? అలాంటి అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’ అని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీఆర్వోల చేత భూ సంబంధ పనులేవీ చేయించొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయినా ఆ పనులే చేయాలని, చేయకపోతే సస్పెన్షన్‌కు రాస్తామని, జీత భత్యాలు నిలిపివేస్తామని కొందరు తహశీల్దార్లు బెదిరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి హారాలే సుధాకర్‌రావు, కోశాధికారి కొనబోయిన ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌పై అపారమైన గౌరవం ఉన్నదని, అలాంటిది ఇంట్లో ఎలుకలు పడ్డాయాని ఇంటినే తగులబెట్టిన చందంగా వ్యవస్థాగతమైన తప్పిదాలకు తమల్ని బాధ్యులను చేస్తూ వీఆర్వో వ్యవస్థనే రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని లేఖలో పేర్కొన్నారు.

సంఘం డిమాండ్లు
– వీఆర్వోల గత సర్వీస్‌కు భంగం కలగకుండా, రెవెన్యూలోనే రి లొకేట్ చేయాలి
– వీఆర్వోల సీనియరిటి ప్రకారం పదోన్నతులు అమలు చేయాలి.
– వయోభారం పైబడిన, అనారోగ్యతో బాధపడుతున్నవారికి వీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

Advertisement

Next Story

Most Viewed