- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాడిని వదలొద్దు సార్.. కోసేయండి’
దిశ, వెబ్‌డెస్క్: వికలాంగురాలి(మైనర్ బాలిక) పై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. నిస్సహాయస్థితిలో ఉన్న మైనర్ పై తాగిన మైకంలో అత్యాచారం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురంలో కలకలం రేపింది.
ఇదే గ్రామానికి చెందిన వీఆర్ఏ వీరయ్య ఓ తాగుబోతు. నిత్యం మద్యం మత్తులో ఉంటాడు. ఇదే కారణంతో అతడి పోరు పడలేక పెండ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు వదిలేశారు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న వీరయ్య మద్యం మత్తులో అరాచకాలకు తెరలేపాడు. అభం శుభం తెలియని మైనర్ బాలిక.. పైగా వికలాంగురాలు అన్న జాలీ లేకుండా.. కామక్రీడలు చేశాడు.
అతిగా మద్యం సేవించిన వీరయ్య మంగళవారం బాధితురాలి పై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇది తెలుసుకున్న మైనర్ బాలిక తాతయ్య మద్దిరాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్రామంలో మద్యం సేవించిన తర్వాత మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతుండేవాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇటువంటి కీచకుడికి అంగం ఖండన చేయాలని గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు మద్దిరాల ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.