లెక్కింపులో దూసుకుపోతున్న బైడెన్

by Anukaran |   ( Updated:2020-11-03 21:18:47.0  )
లెక్కింపులో దూసుకుపోతున్న బైడెన్
X

దిశ, వెబ్‎డెస్క్ :
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 122, ట్రంప్‌కు 92 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియా, వెర్మాంట్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, డెలావేర్‌, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్‌ విజయం సాధించారు. ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినా, టెన్నెసీ, కాన్సాస్ లో ట్రంప్‌ విజయం సాధించారు.

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. 270 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పీఠం దక్కనుంది. ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న రాష్ట్రాలు కీలక పాత్ర వహించనున్నాయి. ఎక్కువ ఓట్లు వచ్చినవారికే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లు వస్తాయి. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ నమోదైంది.

Advertisement

Next Story