- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో కొత్త ట్విస్ట్.. వారి చర్యలతో నేతల్లో టెన్షన్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారంలో వారే కీలకం. ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించేందుకు, గెలుపుపై ధీమాను వ్యక్తం చేసేందుకు జన సమీకరణ జరుపుతుంటారు. ప్రత్యర్థి పార్టీలను మానసికంగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కూడా జన సమీకరణకు పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. ఏ పార్టీ ప్రచారం చేసిన పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సంఘీభావం తెలుపుతుండటం విశేషం.
టీఆర్ఎస్ పార్టీకి..
టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రచారాలకు వస్తున్న జనాలు అంతా ఇంతా కాదు. కుల సంఘాల సమావేశాలే అయినా, ప్రచారం కోసం చేపడుతున్న సభలతో పాటు మంత్రులు, అభ్యర్థి హాజరవుతున్న ప్రతీ సమావేశానికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరువుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తండోప తండాలుగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడుస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ప్రచారం నిర్వహించినా జన సమీకరణలో మాత్రం ఫెయిల్ కావడం లేదు.
బీజేపీ తక్కువేం కాదు..
తాజాగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ప్రచారానికి, ఆయన సతీమణి జమున చేపట్టిన క్యాంపెయిన్‌కు కూడా జన సమీకరణ పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రజలు హాజరవుతున్నారు. ఏ గ్రామంలో ప్రచారం నిర్వహించినా ఈటలకు మద్దతు ఇస్తున్నారు.
కాంగ్రెస్‌కు అండ..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేసినప్పటి నుండి ఆ పార్టీ ప్రచారంలోనూ జనం భారీగా హాజరవుతూనే ఉన్నారు. నామినేషన్ వేసిన రోజున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైన సభకు కూడా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో, అన్ని పార్టీలను హుజురాబాద్ ప్రజలు ఆదరిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.
ఉల్టా పల్టా..
హుజురాబాద్ ఎన్నికల ప్రచార పర్వంలో గత పరిస్థితులకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గతంలో తమకు మద్దతుదారులు ఇంత మంది ఉన్నారన్న సంకేతాలు ఇచ్చేందుకు జన సమీకరణ చేసేవారు. కానీ, ఇప్పుడు అన్ని పార్టీల సభలకు జనం హాజరవుతుండటం గమనార్హం. గతంలో ప్రచారం తీరు, ఆయా పార్టీలకు అండగా నిలుస్తున్న జనాన్ని బట్టి అక్కడ అభ్యర్థుల పరిస్థితి ఏంటీ.? అని అంచనా వేసే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి మాత్రం హుజురాబాద్‌లో కనిపించడం లేదు. ఎవరు వచ్చినా, ఏ పార్టీ ప్రచారం చేసినా పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తున్నారు. దీంతో, వీరు ఎవరికి అండగా నిలుస్తున్నారన్నదే ఫజిల్‌గా మారింది. మూడు పార్టీల వారికి అండగా నిలుస్తున్న తీరు ఇటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఓ అంచనాకు రాలేని పరిస్థితి చేరుకుందన్నది వాస్తవం.
జర్క్ ఇస్తున్నారా..?
ఇప్పటి వరకు ఎన్నికల తంతులో ఓటర్ల చెవిలో పూలు పెడుతూ వచ్చిన పార్టీలకు సామాన్యులు జర్క్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతకాలం మీరు చెప్పే మాటలు నమ్మి మోసపోయాం, ఇప్పుడు మమ్మల్ని చూసి మీరు సంబరపడండి. కానీ, మేము ఎవరికి ఓటేస్తామో పోలింగ్ బూత్‌లోకి వెళ్లే వరకు చెప్పం అన్న రీతిలో ఇక్కడి ఓటర్లు మసులుకుంటున్నారు. ప్రచారాలకు వచ్చే వారిని పొలిటికల్ పార్టీలు ఎలా వాడుకోవాలని చూస్తున్నాయో.. సగటు పౌరుడు కూడా పొలిటికల్ పార్టీలను అలాగే వాడుకోవాలని చూస్తున్నారన్నట్టుగా అక్కడ పరిస్థితి మారింది.
లోగుట్టు పెరుమాళ్లకెరుక..
అంతర్లీనంగా చాలా మంది ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఏ పార్టీ నాయకులు వచ్చినా జై కొడుతూ వారికి తాత్కాలిక ఆనందం పంచుతున్నారు. చివరి క్షణంలో మాత్రం తాము ఎవరికి బాసటగా నిలుస్తామో అది మాకే తెలుసు అన్నట్టుగా ఉంది హుజురాబాద్ ఓటర్ల తీరు. ప్రచార పర్వంలో ఆయా పార్టీల నాయకులు ప్రభావితం చేసే విధంగా ఉపన్యాసాలు ఇస్తున్నా అటెండ్ అయ్యే వారు మాత్రం జై అంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఆరోపణలు, ప్రతి ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నా సామాన్యుడు మాత్రం కిమ్మనడం లేదని చెప్పాలి. ఏది ఏమైనా హుజురాబాద్ బై పోల్స్‌లో మాత్రం కొంత వెరైటీ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.