- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చివరి అంకానికి ఓటుకు నోటు కేసు..
దిశ, క్రైమ్బ్యూరో : ఓటుకు నోటు కేసు ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. గత నెల 19నే తుది విచారణకు సిద్ధంగా ఉండాలని ఏసీబీ కోర్టు నిందితుల తరపు న్యాయవాదులకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి తుది విచారణ ప్రారంభించనున్నట్టు కోర్టు పేర్కొంది. ప్రజాప్రతినిధుల కోర్టు కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే.
దీంతో ఆరేళ్లుగా ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతున్న ఓటుకు నోటు కేసు రెండు నెలలుగా ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసులో దాఖలైన రెండు పిటిషన్లపై ప్రత్యేక విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు రెండింటినీ కొట్టివేసింది. తుది విచారణను ఈ నెల 8 నుంచి ప్రారంభించేందుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమైంది. దీంతో ఓటుకు నోటు కేసులో నిందితుల వీడియోలు, ఆడియో (ఫోన్) రికార్డులకు సంబంధించిన రెండు హార్డ్ డిస్క్‌లతో పాటు డీవీడీఆర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం కోర్టుకు అందించారు. ఫిర్యాదు దారుడు స్టీఫెన్ సన్ 8న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.