- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధుల కోసం వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: ఈక్విటీ షేర్ల జారీ, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ. 25 వేల కోట్లను సేకరించే ప్రణాళికలకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా శుక్రవారం వెల్లడించింది. నిధుల సమీకరణ ప్రక్రియ కంపెనీ తిరిగి ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడుతుందని, నిర్వహణ ఖర్చులను తగ్గించే చర్యలను తీసుకోవడం ద్వారా రానున్న 18 నెలల్లో రూ. 4 వేల కోట్ల పొదుపు అవకాశముంటుందని కంపెనీ వెల్లడించింది.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలతో మార్కెట్ వాటాను నిలిపుకునేందుకు కంపెనీ పోరాడుతున్న తరుణంలో నిధుల సమీకరణ జరుగుతోంది. ఏజీఆర్ బకాయిల కారణంగా గతేడాది వొడాఫోన్ ఐడియా దారుణంగా దెబ్బతిన్నది. ప్రభుత్వానికి రూ. 58,254 కోట్ల బకాయిలను చెల్లించాల్సి వచ్చింది. కాగా, సుప్రీంకోర్ట్ ఏజీఆర్ బకాయిల అంశంలో టెలికాం కంపెనీలు పదేళ్లలో చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో నిధుల సమీకరణపై స్పష్టత వచ్చింది. కాగా, వొడాఫోన్ ఐడియా ఇప్పటివరకు టెలికాం విభాగానికి ఏజీఆర్ బకాయిల కింద రూ. 7,854 కోట్లను చెల్లించిన సంగతి తెలిసిందే.