ఇవాళ సాయంత్రం 5:49 గంటలకు ఆత్మహత్య చేసుకుంటా..

by Anukaran |   ( Updated:2021-03-20 02:30:23.0  )
vizag steel plant
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘ఉక్కు ఉద్యమం’ తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలోని అధికార పార్టీతో పాటు, విపక్షాలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా.. దీనిపై ఉక్కు కర్మాగార కార్మికుడు రాసిన లేఖ, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శ్రీనివాస్ అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శనివారం ఓ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. ఆ సూసైడ్ నోట్‌లో..

suicide note

“ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు కొలమిలో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమిషాలకు మూహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి” అని రాసి ఉంది. దీంతో కార్మిక సంఘాల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అతడి కోసం అటు పోలీసులతో పాటు కుటుబం సభ్యులు, కార్మికులు గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం కార్మిక గర్జన మొదలయ్యే సమయానికి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం ఉన్నట్లు కూడా సూసైడ్ నోట్‌లో రాయడంతో రాష్ట్రంలో ఈ లేఖ సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed