- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బాధితుడు క్షేమం.. పుకార్లు నమ్మద్దు: వైజాగ్ కలెక్టర్
కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి సురక్షితంగా ఉన్నాడని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కరోనా బాధితుడు చనిపోయాడన్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు ప్రచారమవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని.. పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. వైజాగ్‌లో క్వారంటైన్ కోసం నాలుగు వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశామని ఆయన చెప్పారు. 500 బెడ్స్ ఐసోలేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా కేసు నమోదైన నేపథ్యంలో 115 బృందాలతో ఇంటింటి సర్వే చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, ఆంధ్రాయూనివర్సిటీ ఇలా కరోనా ప్రభావం చూపించే ప్రతిదాన్ని మూసేశామని ఆయన తెలిపారు.
Tags : visakhapatnam, collector, vinay kumar, corona, covid-19