తయారీని 40% పెంచుతాం -వీవో ఇండియా

by Harish |
తయారీని 40% పెంచుతాం -వీవో ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: 2021 నాటికి భారత్‌లో ఉత్పత్తి అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో స్థానికీకరణను 40 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వీవో ఇండియా శుక్రవారం తెలిపింది. స్థానిక తయారీఇ ప్రోత్సహించడానికి ప్రభుత్వం మదర్ ‌బోర్డ్‌లు, ప్యానెల్, టచ్‌ప్యాడ్‌ల వంటి మొబైల్‌ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం పెంచింది. దీన్ని అధిగమించడానికి వీవో ఇండియా స్థానికీకరణ స్థాయిని పెంచాలని యోచిస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో వీవో ఇండియా 15 శాతం హ్యాండ్‌సెట్‌లను స్థానికంగానే తయారు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీవో ఇండియా నిబద్ధతను కొనసాగిస్తూ దేశీయంగా తయారీని 40 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తున్నట్టు వీవో ఇండియా డైరెక్టర్ నిపున్ మార్యా చెప్పారు. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వీవో ఇండియా 28 శాతం మార్కెట్‌ను దక్కించుకుంది. ప్రస్తుత ఏడాది ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వాల్యూమ్‌ల పరంగా మెరుగైన బ్రాండ్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్ అమ్మకాల పరంగా కీలకమని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed