జ్వాల, అమలాపాల్ కు సంబంధం లేదు

by Shyam |
జ్వాల, అమలాపాల్ కు సంబంధం లేదు
X

నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని… అసలు జ్వాల వల్లే విష్ణు తన భార్య రజినీకి విడాకులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు విష్ణు. నా భార్య రజినీ నుంచి విడిపోయాకే తనకు జ్వాల పరిచయం అయింది అన్నారు. నాది ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అన్న సిద్ధాంతం అని… నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. వ్యక్తిగత కారణాలతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ఇక నా జీవితంలో పెళ్లికి, ప్రేమకు చోటు లేదని తెలిపారు. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా జ్వాల వల్లే మేము ఇద్దరం విడిపోయామని వార్తలు రాయడం బాధ కలిగించింది అన్నారు విష్ణు. జ్వాలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలా అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇక జ్వాల చాలా పాజిటివ్ అని… తను మనుషులను చాలా బాగా అర్ధం చేసుకుంటుందని చెప్పారు విష్ణు.నిజానికి మేము మంచి స్నేహితులం అన్నారు.

అమలాపాల్ కూడా నా భార్య నుంచి విడిపోయెందుకు కారణమని కొన్ని పత్రికలు రాశాయని… అసలు ఇలా ఎలా అలోచిస్తరో అర్ధం కాదన్నారు.

ప్రస్తుతం విష్ణు విశాల్ రానా హీరోగా వస్తున్న “అరణ్య” సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ” మోహన్ దాస్ ” చిత్రంతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

Tags : Vishnu Vishal, Gutta Jwala, Amala Paul, Aranya

Advertisement

Next Story

Most Viewed