- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి దర్శకుడు అవసరం లేదు : విశాల్
దిశ, వెబ్‌డెస్క్: హీరోగా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న విశాల్… డైరెక్టర్‌గా మారిపోయాడు. తుప్పరివాలన్(డిటెక్టివ్) సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే దీనిపై తుప్పరివాలన్ డైరెక్టర్ మిస్కిన్ రోజుకో సెటైర్ వేస్తూ గొడవకు దిగుతున్నాడు. దీంతో విశాల్ కూడా మరో పంచ్ వేయాల్సి వస్తుంది. దీంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు విశాల్. అసలు గొడవేంటి? ఎందుకు తుప్పరివాలన్ -2 ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్‌ను తప్పించాల్సి వచ్చిందో క్లియర్‌గా చెప్తూ నోట్ రిలీజ్ చేశాడు.
డైరెక్టర్ మిస్కిన్ కథ రాసుకునేందుకు కెనడా, అమెరికా అంటూ తిరిగేసి నిర్మాతనైన తన డబ్బులు రూ. 35 లక్షలు వృథా చేశాడని తెలిపాడు విశాల్. నాకు తెలియక అడుగుతున్నా డైరెక్టర్ కథ రాసేందుకు నిర్మాత డబ్బులు ఎందుకు వాడాలని ప్రశ్నించాడు. ఎలాంటి ప్లాన్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసి రూ. 13 కోట్లు నీటిపాలు చేశాడని .. అలాంటప్పుడు నిర్మాతగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదా అన్నాడు. అసలు ఒక డైరెక్టర్‌ను ప్రాజెక్ట్ మధ్యలో నుంచి తప్పించాల్సి వచ్చిందంటే నిర్మాతను ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడో ఆలోచించాలన్నాడు. రోజుకు రూ.15లక్షలు షూటింగ్ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు కనీసం రెండు సీన్లు తీయమని అడిగానని.. లేదంటే డే అండ్ నైట్ షూట్ చేద్దామని కోరానని చెప్పాడు. కానీ అందుకు కూడా ఒప్పుకోకుండా లైట్ తీసుకున్నాడని… అందుకే మిస్కిన్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పాడు. సొంత బిడ్డను అనాథాశ్రమంలో వదిలేసినట్లు తుప్పరివాలన్ -2ను వదిలేసేందుకు మనసు అంగీకరించలేదని .. అందుకే దర్శకత్వ బాధ్యలు తీసుకున్నాని తెలిపాడు విశాల్. డైరెక్టర్‌గా నా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరాడు. కొత్తగా ఇండస్ట్రీకి రాబోయే నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని ఈ నోట్ రిలీజ్ చేసినట్లు తెలిపిన విశాల్.. ఇలాంటి సమస్యలు మరో నిర్మాత ఎదుర్కోకూడదనేదే తన ఉద్దేశం అని తెలిపాడు.
Tags: Vishal, Tuppariwaalan, Mysskin, Direction, Detective, War