కోహ్లీని కెప్టెన్‌గా తొలగించాలి : ఆసీస్ క్రికెటర్

by Shyam |
కోహ్లీని కెప్టెన్‌గా తొలగించాలి : ఆసీస్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్: ‘నేనే కనుక సెలెక్టర్‌ని అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించి.. రహానేకు బాధ్యతలు అప్పగించే వాడిని’ అంటూ ఆసీస్ మాజీ ఆల్‌రౌడర్ షేన్ లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి పెట్టాలంటే అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించాలని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కెప్టెన్సీలో సహయక క్రికెటర్లు భయపడుతున్నారు. అదే రహానేకు కెప్టెన్సీ ఇస్తే వాళ్లు స్వేచ్ఛగా ఆడగలుగుతారని షేన్ లీ అన్నాడు. విరాట్ గొప్ప బ్యాట్స్‌మెన్. అతడంటే టీమ్ ఇండియా క్రికెటర్లకు అత్యంత గౌరవం ఉంది. దాంతో వాళ్లు అతడికి భయపడుతున్నారు. కోహ్లీ కచ్చితమైన ఫలితాలు కోరుకుంటాడు. అదే అతడంటే భయపడేలా చేస్తున్నది. కానీ రహానే సారథ్యంలో స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈ తేడా ఆస్ట్రేలియా పర్యటనలో సులభంగా అర్దం అయ్యిందని షేన్ లీ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున షేన్ లీ 45 వన్డేలు ఆడాడు. దిగ్గజ బౌలర్ బ్రెట్‌లీకి స్వయానా సోదరుడు.

Advertisement

Next Story

Most Viewed