- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా కంటే జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్ : కొహ్లీ
దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియాలో తన కంటే రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్ అని.. బంతిని వికెట్ల పైకి విసరడంలో అతని నైపుణ్యం అమోఘమని కెప్టెన్ విరాట్ కొహ్లీ అన్నాడు. భారత క్రికెట్ జట్టులో ఎందరో మెరుగైన ఫీల్డర్లు ఉన్నారు. ఒకప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం భారత జట్టు ఫీల్డింగ్ విషయంలో చాలా రెట్లు మెరుగుపడింది. గతంలో ఫీల్డింగ్ అంటే రాబిన్ సింగ్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ పేర్లు మాత్రమే వినపడేవి. కానీ, ఇప్పుడు జట్టులో దాదాపు అందరూ చక్కని ఫీల్డర్లే. కాగా, ప్రస్తుత ఫీల్డింగ్ విషయంపై స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది. ‘డైరెక్ట్ త్రో ద్వారా స్టంప్స్‌ను ఎగరగొట్టడంలో విరాట్ లేదా జడేజాలలో మీరు ఎవరిని ఎంచుకుంటారు’ అని ప్రశ్నించింది. దీనికి విరాట్ రిప్లై ఇస్తూ..’నాకైతే ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సారి జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నాడు. కొహ్లీ రిప్లైకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.