- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జట్టు సారథిగా కోహ్లి సాధించింది ఏం లేదు : గంభీర్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అధిగమించి ఉండొచ్చు. కానీ, ఒక కెప్టెన్‌గా ఇంత వరకు సాధించింది ఏమీ లేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక బ్యాట్స్‌మాన్‌గా చెలరేగి ఆడుతున్న కోహ్లి జట్టును నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాడికైనా ప్రపంచ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఉండాలి. అది సాధించకపోతే కెరీర్‌కు అర్థం ఉండదని గంభీర్ చెప్పాడు. వ్యక్తిగత రికార్డులతో వచ్చేదేం ఉండదు. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక టీంస్పోర్ట్ అని చెప్పాడు. బ్రియన్ లారా వ్యక్తిగతంగా పరుగులు చేశాడు. జాక్వెస్ కల్లీస్ ఎన్నో వికెట్లు తీశాడు. కానీ ,వారు ప్రపంచకప్ అందుకోలేకపోయారు. అందుకే ఫేమ్‌లో లేకుండా పోయారు అని గంభీర్ చెప్పాడు. ఇప్పటికైనా కోహ్లి నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ టైటిల్ గెలవడంపై దృష్టి పెట్టాలని గంభీర్ సూచించాడు.