వయోలిన్‌ విధ్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ మృతి

by Shamantha N |
వయోలిన్‌ విధ్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ : వయోలిన్ విధ్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) కన్నుమూశారు. చెన్నైలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1928 అక్టబరు 6వతేదీన కేరళలో జన్మించిన టీఎన్ కృష్ణన్.. 1939లో తిరువనంతపురంలో సోలో వయోలిన్ కచేరిని నిర్వహించారు. అలాగే అలెప్పీ కే పార్థసారధి వద్ద కూడా ఆయన కెరీర్ ప్రారంభంలో శిక్షణనిచ్చారు. అనంతరం తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నై మ్యూజిక్ కళాశాలలో పనిచేసిన కృష్ణన్ చాలామంది విద్యార్థులకు వయోలిన్ నేర్పించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా పనిచేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత కళానిధి వంటి పలు పురస్కారాలను కృష్ణన్ అందుకున్నారు. టీఎన్ కృష్ణన్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed