- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవిత్ర నగరంలో చెలరేగిన హింస.. 20 మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్ రాజధాని (పవిత్ర నగరం) జెరూసలేంలో హింసాత్మక ఘటనలు భయాభ్రాంతులకు గురిచేశాయి. సోమవారం అల్-అక్సా మసీదులో ఇజ్రాయిల్ పోలీసులపై పాలస్తీనా పౌరులు రాళ్లదాడి చేయడంతో.. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రంజాన్ మాసంలో జెరూసలేంకు అత్యథికంగా పాలస్తీనవాసులు వస్తుంటారు. ఇదే సమయంలో ఇజ్రాయిల్ భద్రతా దళాలతో వారికి పలుమార్లు వివాదం జరిగింది.
మరోవైపు ఈస్ట్ జెరూసలేం శివారు షేక్ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్ సెటిలర్లు ఆక్రమించుకోవడంతో.. ఇరు వర్గాల వివాదం కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారింది. ఈ పరిణామాల మధ్య అల్-అక్సా మసీదు వద్ద అత్యథిక సంఖ్యలో ఉన్న పాలస్తీనియన్లు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీనికి బదులుగా ఇజ్రాయిల్ పోలీసులు రబ్బర్ బులెట్లు, స్టన్ గ్రెనేడ్లు, బాష్పవాయువు ప్రయోగించారు. అల్–అక్సా మసీదు ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ రణరంగంలో 305 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మంది పౌరులు మరణించినట్టు పాలస్తీనా అధికారులు స్పష్టం చేశారు. పోలీసుల్లో చూడా 21 మంది గాయపడినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది.
ఈ ప్రకటనతో అల్-అక్సా మసీదు వద్ద ఇజ్రాయిల్ భద్రతా దళాలు భారీగా మోహరించిడం, వైమానిక దాడులు, సైరన్ల మోతతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా గాజాలోని హమాస్ మిలిటెండ్ సంస్థ డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉధృతం అయింది. మరోవైపు నార్త్ గాజాలో భారీ పేలుడు జరిగి 9 మంది చనిపోయారు. ఈ ఘర్షణలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని జెరూసలేం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.