- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీతి ఆయోగ్ సీఈవోకు వినోద్ కుమార్ లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన పసుపు, మిర్చి, మామిడి పంటను ఎగుమతి చేసేందుకు ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. కొవిడ్ నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పసుపు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మిర్చి, రాష్ట్రవ్యాప్తంగా మామిడి ఉత్పత్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయని వినోద్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. అపెడ, వరంగల్ స్పైస్ బోర్డులు కలిసి అధ్యయనం చేసి రాష్ట్రంలో నుంచి పసుపు, మిర్చి, మామిడిని విదేశాలలో ఎగుమతి చేసేందుకు నివేదిక సిద్ధం చేశాయని తెలిపారు. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్(ఈ.ఓ.యూ) క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసేందుకుగాను రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.226.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపిందని వివరించారు. ఈ క్లస్టర్స్‌ను ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఆ ప్రతిపాదనలో పేర్కొన్న విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.