Twitter రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాశ్..

by Shamantha N |
twitter news
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎట్టకేలకు కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ చట్టం-2021 ప్రకారం ట్విట్టర్ కంపెనీ దేశానికి చెందిన వ్యక్తిని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ట్విట్టర్ (Twitter) నూతన ఐటీ చట్టాన్ని పలుమార్లు విస్మరించిందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం గ్రీవెన్స్ అధికారి నియామకం ఇష్యూ ఢిల్లీ హైకోర్టులో ఉండగా.. దేశానికి చెందిన వినయ్ ప్రకాశ్‌ను రెసిడింట్ గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ యాజమాన్యం నియమించింది.

గతంలో ధర్మేంద్ర చతుర్‌ను ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ కంప్లైయెన్స్ అధికారిగా నియమించింది. అయితే, అతను గత నెలలో పదవి నుంచి తప్పుకున్నాడు. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి ఎనిమిది వారాలు సమయం అవసరమని ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.

https://www.inshorts.com/en/news/twitter-appoints-vinay-prakash-as-resident-grievance-officer-for-india-1625981064965

Advertisement

Next Story

Most Viewed