- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సార్.. ఇంటి పక్కన మద్యం దుకాణం.. అందుకే కూతుర్ని అలా..!
దిశ, నెక్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియను గత రెండు రోజుల క్రితం పూర్తి చేసింది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసే కొత్త మద్యం షాపులను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో మండల కేంద్రంలో మూడు మద్యం షాపులు ఉండగా, ప్రస్తుతం నెక్కొండకు నాలుగు మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గతంలో మూడు మద్యం షాపులు మండల కేంద్రంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ప్రస్తుతం మద్యం షాపులు ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్యం షాపులు ఏర్పాటు చేయడం కారణంగా పక్కనే ఉన్న ప్రజలకు మద్యం ప్రియులతో ఇక్కట్లు తప్పడం లేదు. అలా కాకుండా ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
ఒక్క కూతురుని హాస్టల్లో చేర్పించాను
మద్యం దుకాణం మా ఇంటికి ఆనుకొని ఉండటం కారణంగా తరచూ మద్యం తాగి వచ్చే వారితో ఇబ్బందులు తలెత్తడంతో నాకు ఉన్న ఒక కూతుర్ని హాస్టల్లో చేర్పించాను. నేను ప్రతి రోజు ఉదయం గొర్రెలను మేపడానికి వెళ్ళగానే ఎవరు లేని సమయంలో ఇంట్లోనే కూర్చొని తాగుతున్నారు. ఇదేంటని అడగగా కొందరు తాగి నా మీదకు దాడికి దిగారు. అంతేకాకుండా ఇంటి నిండా గ్లాసులు, మద్యం సీసాలు వేస్తున్నారు. నా భార్య 6 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఈ క్రమంలో మా ఇంట్లో నేను నా కొడుకు, కూతురు ఉంటాము. మద్యం దుకాణంలో మందు తాగి మా ఇంటి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. తాగుబోతుల బాధ భరించలేక నా 14 సంవత్సరాల కూతురును మండలంలోని పెద్దకొరోల్ గ్రామంలోని కస్తూర్భా గాంధీ హాస్టల్‌లో చేర్పించాను. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మద్యం దుకాణాలు ఊరి బయట ఉండేలా చర్యలు తీసుకోని మాకు మధ్యం ప్రియుల నుండి రక్షణ కలిపించాలి.
గ్రామస్థుడు జునుకజువ సమ్మయ్య
- Tags
- liquor shops