పశువుల కొట్టానికి కేసీఆర్ చీర..

by Sridhar Babu |   ( Updated:2021-05-11 00:08:38.0  )
పశువుల కొట్టానికి కేసీఆర్ చీర..
X

దిశ, వేములవాడ: ఆడపడుచులకు చీరలంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఏ పండుగ వస్తుందో ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుందా.. అని కళ్లలో ఓత్తులేసుకుని చూస్తారు. ఇక బతకమ్మ పండుగ వస్తే చెప్పనవసరం లేదు.. తెలంగాణలో అతిపెద్ద పండుగ, ఆడపడుచులందరికి ఎంతో ఇష్టం అయిన పండుగ. ఇక ఈ పండగకోసం ఎలాంటి చీరకొనాలి అని పండుగ నెలరోజుల ముందునుంచే ప్లాన్ చేస్తుంటారు. అయితే ఆడపడుచులకు ఇష్టమైన పండుగకు వారు ఎంతో ఇష్టపడే చీరలను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు అందిస్తుంది.

బతుకమ్మ పండుగ కానుకగా కేసీఆర్ చీరల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బతుకమ్మ పండుగకు కెసీఆర్ చీరల డిజైన్ మార్పు చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ పంపిణీ చేసిన చీరలను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బర్ల కొట్టానికి కంచెగా చీరలు కట్టడం విశేషం. కేసీఆర్ ఇచ్చే చీరలు ఎంత వరకు ప్రజలు తీసుకుంటున్నారా లేదా అని ఈ సంఘటనతో అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరం ఉందని తెలుసుకొని పథకాలను ప్రవేశ పెట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed