ఆడవేషంలో మగాడు.. చితకబాదిన స్థానికులు

by Anukaran |   ( Updated:24 July 2020 11:27 AM  )
ఆడవేషంలో మగాడు.. చితకబాదిన స్థానికులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ శివార్లలో ఆడ వేశంతో తిరుగుతున్న ఓ మగాడిని పట్టుకుని స్థానికులు చితకబాదారు. గత కొంతకాలంగా కరీంనగర్ శివార్లలోని బైపాస్ రోడ్డులో అద్దెకు ఉంటున్న 50 ఏళ్ల వ్యక్తి ఆడవారిలా వేషం వేసుకుంటూ మహిళలతో చనువుగా ఉంటున్న విషయాన్ని స్థానికులు గమనించారు. అతన్ని కొద్ది రోజులుగా గమనిస్తున్న స్థానికులు పట్టుకుని కట్టేసి చితకబాదారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడం నగరంలో చర్చనీయాశంగా మారింది. అయితే అతను స్త్రీలు ధరించినట్టుగానే వస్త్రాలు ధరించడానికి కారణం మాత్రం తెలియరాలేదు.

Next Story