- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కుటుంబానికి ఆపద్భాందవుడైన గ్రామ కార్యదర్శి..
దిశ, చేవెళ్ళ : ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోతున్న ఎద్దుల బండితో పాటు రైతు కుటుంబాన్ని ఓ గ్రామకార్యదర్శి క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. అస్పల్లిగూడ గ్రామానికి చెందిన బాయికాడి నర్సింహులు అతని కుటుంబ సభ్యులు ఆరుగురు ఎద్దుల బండిపై పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా.. అస్పల్లి గూడ-షాబాద్ మధ్య గల వాగు ఉధృతంగా ప్రవహించింది.
త్వరగా ఇంటికి చేరుకుందామన్న ఆతృతతో బాయికాడి నర్సింహులు ఎద్దుల బండితో వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎద్దుల బండి వాగు ప్రవాహంలో ఒకవైపు కొట్టుకుపోగా ఎల్గొండ గూడ గ్రామ కార్యదర్శి యాదయ్య పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించేందుకు జేసీబీతో గుంతలు తీయిస్తున్నాడు. వాగు ప్రవాహంలో ఎద్దుల బండితో సహా కొట్టుకుపోతున్న రైతు కుటుంబం ఆర్తనాదాలు (అరుపులు)విన్న గ్రామ కార్యదర్శి వెంటనే జేసీబీని వాగు వద్దకు తీసుకెళ్లాలని సూచించాడు. ఎద్దుల బండితో సహా ఆరుగురు వ్యక్తులను వాగు ప్రవాహంలో నుంచి సురక్షితంగా కాపాడ గలిగారు. యాదయ్య చాకచక్యంతో ఎద్దుల బండితో సహా బాయికాడి నర్సింహులు, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు క్షేమంగా బయటకు పడటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.