ఆ ట్రైన్‌‌ను నడిపేది మహిళా సారధులే..

by srinivas |
ఆ ట్రైన్‌‌ను నడిపేది మహిళా సారధులే..
X

విజయవాడ :
విజయవాడ రైల్వే డివిజన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.త్వరలోనే ఓ రైలును మహిళా సారధులతో నడిపించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ ట్రైన్ కూడా విజయవాడ నుంచే ప్రారంభం కానుంది. విజయవాడ టు గూడూరు మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం. రైలును నడిపే లోకో పైలట్ నుంచి టీటీ, గార్డు, స్వీపింగ్, ఫుడ్ డెలివరీ నుంచి అంతా మహిళల సారధ్యంలోనే ఈ ట్రైన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

Tags: women operate, vijayawada, intercity train, loco pilot to sweeper

Advertisement

Next Story

Most Viewed