- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేశ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి గజకంటి మహేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సీపీ బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. మద్యం మత్తులో వివాదం జరగడం వల్లే హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి.. మహేశ్‌పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు. సాకేత్‌రెడ్డికి విజయవాడలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ రెడ్డి ఫ్రెండ్ కాగా.. రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ మద్యం తాగటానికి వచ్చారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని హైదరాబాద్ నుంచి పిలిపించాడు. అయితే కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ మద్యం మత్తులో మహేష్‌తో గొడవపడి తుపాకీతో కాల్పులు జరిపాడు. సాకేత్ ఎప్పుడూ తన వెంట రివాల్వర్ వెంటపెట్టుకొని తిరుగుతాడని.. ఆ తుపాకీని బీహార్ గయాలో రూ.45వేలకు కొనుగోలు చేశాడని’ సీపీ తెలిపారు. కిడ్నాప్ వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై కేసులు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీపీ పేర్కొన్నారు.