- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నమ్రత పై బెజవాడ పోలీసులు నిఘా
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ సృష్టి ఆస్పత్రి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డాక్టర్ నమ్రత అక్రమాల పై విజయవాడ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ కరుణ పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ నమ్రత.. నమ్రతాస్ సృష్టి పేరుతో భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అటు విశాఖ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాల్లో.. సృష్టి ఆస్పత్రి లీలలు వెలుగు చూడటం సంచలనం రేపింది. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సృష్టి పై కేసు నమోదుతో బెజవాడ పోలీసుల అప్రమత్తం అయ్యారు. దీంతో సృష్టి ఆస్పత్రి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story