గాయత్రీ దేవిగా కటాక్షించిన అమ్మవారు

by Hamsa |
గాయత్రీ దేవిగా కటాక్షించిన అమ్మవారు
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను కటాక్షించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు ఆశ్వయుజ శుద్ధ తదియ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ గాయత్రీ దేవి పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవతగా అనుగ్రహించింది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వల్ల మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు.

కనక పుష్యరాగ హారం వితరణ

కనకదుర్గమ్మకు ఎన్​ఆర్​ఐ భక్తుడు తాతినేని శ్రీనివాస్​రూ.45 లక్షల విలువైన కనక పుష్యరాగ హారాన్ని సమర్పించారు. ఈహారాన్ని ప్రతీ గురువారం అమ్మవారికి అలంకరిస్తారు.

Advertisement

Next Story